SNEHAMA
స్నేహ మా
స్నేహ మా
వారించకే నన్నిలా
వారించకే నన్నిలా
వారించి వారించి విసిగించకే
వారించి వారించి విసిగించకే
అమెరికా గూటిలో పక్షివి నీవు
అమెరికా గూటిలో పక్షివి నీవు
ఉష్ణ దేశపు విహంగాన్ని నేను
ఉష్ణ దేశపు విహంగాన్ని నేను
భావి తరానికి బావుటా నేను
భావి తరానికి బావుటా నేను
లోకమంతా నిదురోయే వేళ
లోకమంతా నిదురోయే వేళ
రెక్కలు రాని చిన్నారులకోసం
రెక్కలు రాని చిన్నారులకోసం
నా గుండె కార్చిన కన్నీరే ఈ తెలుగోయి
నా గుండె కార్చిన కన్నీరే ఈ తెలుగోయి
పదే పదే వేధిస్తావు నీ కదేమి తెగులోయి
పదే పదే వేధిస్తావు నీ కదేమి తెగులోయి
లోకం మారదని మూసలోనే నడుద్దామా?
లోకం మారదని మూసలోనే నడుద్దామా?
రొట్టెముక్క కోసం వెదికే కుక్కల్లా
రొట్టెముక్క కోసం వెదికే కుక్కల్లా
దోపిడీకి కొత్త దారులు వెతుకుదామా ?
దోపిడీకి కొత్త దారులు వెతుకుదామా ?
నీ తేనియ మాటల తుంపర్లతో
నీ తేనియ మాటల తుంపర్లతో
అగ్ని పర్వతాన్ని అణచి పెట్టలేవు
అగ్ని పర్వతాన్ని అణచి పెట్టలేవు
క్రొత్త దారుల్లో ముళ్ళు ఉంటాయని తెలుసు
క్రొత్త దారుల్లో ముళ్ళు ఉంటాయని తెలుసు
కొండచిలువలు కోరలు చాస్తాయని తెలుసు
కొండచిలువలు కోరలు చాస్తాయని తెలుసు
తెలిసి తెలిసి మృత్యు పరిష్వంగం ఎంత మధురమో
తెలిసి తెలిసి మృత్యు పరిష్వంగం ఎంత మధురమో
ఊహల పల్లకిలో ఊగే నా మనసుకి తెలుసు .
ఊహల పల్లకిలో ఊగే నా మనసుకి తెలుసు .
నేడు నేనొక సామజిక శక్తిని, యుక్తిని
నేడు నేనొక సామజిక శక్తిని, యుక్తిని
ఎర్ర కోట మీద నా భావ పతాకాన్ని ఎగరేస్తాను
ఎర్ర కోట మీద నా భావ పతాకాన్ని ఎగరేస్తాను
స్వప్నమే యని చిలిపిగా నవ్వుకోకు
స్వప్నమే యని చిలిపిగా నవ్వుకోకు
క్రొత్త దారులన్నీ వొకనాటి స్వప్నములేగా
క్రొత్త దారులన్నీ వొకనాటి స్వప్నములేగా
సమాధులపై పుష్పించిన మొక్కలేగా !
సమాధులపై పుష్పించిన మొక్కలేగా !
It was 2012, a decade ago I posted this in my blog. Then I was 58 and now 68. Here is my latest post.
సెలవిక సరస సంగీత ధ్వనులకు
నా గుండెలో చేరిన బైపాసు రమణులకు
శయనాగారంలో స్వేద బిందువులకు
కూలరునే కాల్చే వేడి వేడి నిట్టూర్పులకు .
అనుచరులు లేరని చరణాలు ఆగవు
శ్రోతలు లేరని జ్ఞానాన్వేషణ మాగదు
ఆరోగ్యంగా వున్నానని అలిగిన ఆఖరి సతి
సెంచరీ కొట్టేదాకా శుభం కార్డు యివ్వదు .
యు ట్యూబు కలుగులో సేద తీరుతున్న యువత
వెలుగులోకొచ్చే దాక బ్లాగులో కేకలు వేస్తుంటా
రాజకీయ దోపిడీ దందా ఆగేదాకా అరుస్తూనే వుంటా
రైస్ పార్టీ జెండా పట్టి ఎర్రకోట కేసి నడుస్తూనే వుంటా .
దారినిండా జగన్మోహన సంక్షేమ పతకాల బురద
తురక రాజధానిలో సేదతీరుతున్న మసక చంద్రుడు
కాషాయ రంగులో కార్పొరేట్ తత్త్వం నింపిన కమలం
కత్తులన్నీ తెలుగు గుండెలో దించి రిక్త మైన హస్తం .