2024
ELECTIONS MANIFESTO
Dear young boys and girls,
Indian democracy is moving in a wrong direction. It is the responsibility of the youth to put it on the right tract. If we shy away from this task one day you would find yourselves as slaves of the system of governance dominated by the corporate sector.
Perception of the reality by the youth is a solid foundation for any revolution.
రాజకీయ మనగా జాతి మనుగడ సిద్ధాంత రూప కల్పన మరియు దాని ఆచరణ.
వర్తమాన రాజకీయ పార్టిలు తమ తమ మనుగడ సిద్ధాంతములను ఆచరణలో పెడుతున్నాయి. ఎన్నికలలో గెలిచి అధికారమును ఆస్వాధించుటే వాటి లక్ష్యము. ఎన్నికలలో పోటీ చేసేందుకు ధనము కావాలి. ధనము కోటీశ్వరుల చెంత వుంటుంది. భారతీయ ప్రజాస్వామ్యము ధనిక ప్రజాస్వామ్యముగా మారి కొన్ని దశాబ్దములు గడిచి పోయినవి. ధనవంతుల పాలనలో ధనికుల వద్ద సంపద పెరుగుతుంది.
పాలనా యంత్రాంగము లోని అవినీతి వ్యాపారస్తులకు, పన్ను ఎగవేత దారులకు, కాంట్రాక్టర్లకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి అనుకూలముగా వుంటుంది. పాలనా యంత్త్రాన్గము లోని అవినీతిని కట్టడి చేయ వలసిన బాధ్యత ప్రజా ప్రతినిధుల పై వున్నది. కాని ఈ అవినీతి వలన లబ్ది పొందుతున్న వారి జాబితాలో రాజకీయ నాయకులూ వున్నారు. అందుకే ఎన్నికలలో గెలిచిన వారు గాని ఓడిన వారు గాని అవినీతికి వ్యతిరేకముగా పోరు సేయడము లేదు.
రాజకీయము ప్రజల కొరకు పని చేసినప్పుడు ఉన్నతము గాను, నాయకుల స్వార్ధ పంజరంలో చిక్కి నప్పుడు నీచము గాను అగుపిస్తుంది. దేహము మనుగడకు నీరు అవసరం. నీరు కలుషి తమైతే శుద్ధి చేసుకుని త్రాగుతాము . దేశ మనుగడకు రాజకీయము అవసరం . కలుషితమైన రాజకీయాలను శుద్ది చేసి దేశ ప్రయోజనములను కాపాడవలసిన బాధ్యత యువతపై వుంది. యువత ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు పెనవేసుకుని వుంటాయి. రాజకీయ రంగాన్ని స్వార్ధపరులకు అప్పగించి సుపరిపాలన ఆశించడం హాస్యాస్పదం. మన శక్తి దేశానికి ఉపయోగ పడుతున్నదా లేదా అని యువత ఆలోచించాలి.
1. 'రాష్ట్రములోని యంత్రములు, కర్మాగారములు, ట్రాక్టర్లు, టిప్పర్లు, బుల్డోజర్లు, ప్రొక్లేన్లు, లారీలు, బస్సులు, కారులు మరియు యింధనముతో నడిచే అన్ని రకముల పరికరములు ప్రభుత్వము కొరకు సంవత్సరానికి 12 రోజులు ఉచితముగా పనిచేయాలి.' అని శాసనము చేస్తాము.
వీటికి అవసరమైన యింధనమును ప్రభుత్వము సమకుర్చాలి. ఈ విధానము అమలు వలన నదుల అనుసంధానమునకు, రోడ్లు నిర్మాణమునకు, భవనములు కట్టించడానికి, నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించడానికి అవసరమైన వొనరులు సమకూరుతాయి.
2.ఓటు హక్కు గల పౌరులు సంవత్సరములో 12 దినములు రాష్ట్ర ప్రభుత్వము కొరకు ఉచితముగా పనిచేయాలి.
ఈ విధానము వలన అనేక ఉపయోగాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తముగా వున్న వైద్యులు నెలకు ఒక రోజు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితముగా సేవ చేస్తారు. ప్రభుత్వ కార్యాలయములలో ప్రజలు పని చేయుట వలన అవినీతి పునాదులు కదిలి పోతాయి. రాష్ట్రములోని నదుల అనుసంధానమునకు అవసరమైన మానవ శక్తి లభ్యమౌతుంది.
3. అవినీతి నిర్మూలనకు మండల విజిలెన్స్ కమిటీ : అవినీతి, అసమర్ధత నినాదాలతో అంతం కాదు. గ్రామానికి యిరువురు ప్రతినిధులతో మండల విజిలెన్స్ కమిటీ లను అన్ని మండలముల లోను ఏర్పాటు చేస్తాము . మండలము లోని అన్ని ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షించే అధికారము ఈ కమిటీకి యిస్తాము . మండల విజిలెన్స్ కమిటీ ప్రతి ఆది వారం సమావేశ మవు తుంది. ఎవరైనా ప్రభుత్వోద్యోగి పని తీరు సక్రమముగా లేదని ఫిర్యాదు వచ్చిన యెడల సదరు వ్యక్తిని తమ కార్యాలయానికి పిలిపించుకుని సంజాయిషీ అడుగుతుంది. ఆ ఉద్యోగి యిచ్చిన సమాధానము తృప్తి కరంగా లేకపోతే తదుపరి దర్యాప్తు కొనసాగిస్తుంది. దర్యాప్తు లో సదరు ఉద్యోగి దోషి అని తేలిన యెడల అతనిని మండలం నుండి బదిలీ చేయమని మండల విజిలెన్స్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. రాష్ట్ర ప్రభుత్వము కమిటీ నివేదిక ను ఆమోదించి 30 రోజుల లోగా సదరు ఉద్యోగిని మండలం నుండి బదిలీ చేయాలి . ఈ విధముగా రెండు మండలాలలో తిరస్కరించ బడిన వారిని ఉద్యోగాల నుండి శాశ్వతముగా తొలగించాలి.
4. ఉద్యోగుల వేతనాలు : ఉద్యోగుల వేతన నిర్ణయాధికారాన్ని మండల విజిలెన్స్ కమిటీలకు యివ్వాలి. ఆరు ఎకరాల రైతు సగటు వార్షిక ఆదానికి సమానమైన వేతనమును ప్రభుత్వోద్యోగికి చెల్లించాలి. ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణముగా వారి సేవకై నియుక్తులైన వారి జీవన ప్రమాణాలు పెరగాలి. గతంలో పనిచేసిన ఉద్యోగులకు పెన్షన్ చెల్లించేందుకు వర్తమానంలో పన్నులు విధించడము ధర్మ విరుద్ధము. పదవీ విరమణ చేసిన వారి వద్ద వారి జీవన భ్రుతికి సరిపడా వొనరులు వున్నాయని మండల విజిలెన్స్ కమిటి తీర్మానిస్తే ప్రభుత్వము వారి పెన్షన్ నిలుపుదల చేయాలి.
5. 'ప్రభుత్వము అప్పులు చేయ రాదు.' రాష్ట్రములోని ధనవంతుల ఆస్తులను స్వాధీనము చేసికొని వున్న అప్పులు తీర్చ వలెను. 100 కోట్లకు పైబడి వ్యక్తుల వద్ద వున్న స్థిర చరాస్తులను జప్తు చేస్తాము. ప్రభుత్వము చేసిన అప్పులను తీర్చడానికి అవి సరిపోక పోతే, తదుపరి చర్యగా 50 కోట్లకు పైబడి వ్యక్తుల వద్ద వున్న స్థిర చరాస్తులను జప్తు చేస్తాము. అవి చాలక పోతే యింకా దిగువకు వస్తాము.
6. 'ఒక కుటుంబానికి ఒక యిల్లు' సూత్రమును అమలు చేయాలి. మిగులుగా వున్న ఇళ్లను, యింటి స్థలములను ఎటువంటి నష్ట పరిహారము చెల్లించకనే ప్రభుత్వము స్వాధీనము చేసుకొనే వీలు కల్పిస్తూ శాసనము చేస్తాము . భూమి వ్యాపార వస్తువుగా మార కూడదు. అవినీతి పరులు , అక్రమ వ్యాపారాలు చేసేవారు తమ సొమ్ముని దాచుకునేందుకు ఇళ్ళు , స్థలాలు కొంటున్నారు. వాస్తవంలో అది ప్రజల సొమ్మే. మన దేశ జనాభా వేగముగా పెరుగుతున్నది . అందరికి గృహవసతి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నది.
7.'వ్యవసాయ భూమి వ్యవసాయ దారులకు మాత్రమే '. వ్యవసాయేతర రంగములలో స్థిరపడిన వారు వ్యవసాయ భూములను అధిక ధరలకు కొని కౌలు దారీ సంస్కృతిని పెంచు తున్నారు. యిది దేశానికి అరిష్టము. కావున స్వయముగా వ్యవసాయము చేయని వారి వద్ద యున్న వ్యవసాయ భూమిని ప్రభుత్వము స్వాధీనము చేసుకోన వలెను. వ్యవసాయ ఉత్పత్తులపైన సుంకము రద్దు చేస్తాము. రైతులకు తమ పంటను దేశములో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్చ యిస్తాము.
8.విద్య : నేడు విద్య వ్యాపార వస్తువుగా మారిపోయింది. మెరుగైన ఉద్యోగాల కోసం ప్రైవేటు విద్యా సంస్థలలో ఇంగ్లిషు మీడియంలో విధ్యాభ్యాసము అవసరమని విద్యార్ధుల తల్లి దండ్రులను నమ్మించడం లో corporate sector సఫలీకృత మైనది. మధ్య తరగతి ప్రజలు తమ సంతానాన్ని ప్రభుత్వ విద్యాలయాలకు పంపించడం మానేశారు. ఆర్ధికంగా బాగా వెనకబడిన వర్గాలకు చెందిన వారి సంతతి మాత్రమే ప్రభుత్వ బడులలో చదువు తున్నది. పరిస్థితి ఎంతగా దిగజారి పోయిందంటే సర్కారి బడులు 'లేబర్ స్కూళ్ళు ' గా పిలవబడు తున్నాయి. భారత దేశములో విద్య గాడి తప్పింది. దీనిని సరిచేయ వలసిన బాధ్యత మనపై వుంది. తమ సంతానమును ప్రైవేటు విద్యాలయములలో చదివించే వారిని ప్రభుత్వ యంత్రాంగము నుండి తొలగించాలి.
9.వైద్యము : పౌరుల ఆరోగ్యమే అసలైన దేశ సంపద . పౌరులందరికీ ఉచిత వైద్య సదుపాయములు అందించుట రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత. అది ఎలా సాధ్యమో మా వెబ్ సైట్ లో సూచించి నాము .
10. న్యాయస్థానాలు : భారత దేశం లో న్యాయస్థానాలు నేరస్తుల రక్షణకు ఉపయోగ పడినంతగా సామాన్య ప్రజల రాజ్యాంగ బద్ధమైన హక్కుల పరిరక్షణకు ఉపయోగ పడుట లేదన్నది సత్యము . ఈ న్యాయ వ్యవస్థని ప్రజల కోసం పనిచేయించడం మన బాధ్యత. జిల్లా జుడిసియల్ కమిటీలను ఏర్పాటు చేయాలి. మండల విజిలెన్స్ కమిటీ చే ఎన్నుకోబడిన ప్రతినిధి జిల్లా జుడిసియల్ కమిటీ లో సభ్యులుగా ఉంటారు.
ఎవరైనా న్యాయ మూర్తి ప్రలోభాలకు లొంగి తప్పుడు తీర్పు యిచ్చారన్న అనుమానం కలిగినప్పుడు ఆ న్యాయమూర్తిని వివరణ అడిగే హక్కు జిల్లా జుడిసియల్ కమిటికి యివ్వాలి. సదరు న్యాయమూర్తి యిచ్చిన వివరణ సంతృప్తిగా లేనియెడల అతనిని బదిలి చేయమని హైకోర్టును జిల్లా జుడిసియల్ కమిటీ కోరుతుంది . కమిటీ సిఫారసును హైకోర్టు మన్నించవలెను. అదే కేసు హైకోర్టులో విచారణ జరిగినప్పుడు కమిటీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. పదవీ విరమణ చేసిన తరువాత సైతం తమ తీర్పులపై సమీక్ష జరిపి ప్రజలు తమని శిక్షిస్తారు అన్న భావన మదిలో వుంటే ఏ న్యాయ మూర్తి తప్పు చేయడు
దోపిడి: ప్రజలు మూడు రకముల దోపిడికి గురౌతున్నారు. ౧.రాజకీయము ౨.పాలనా యంత్రాంగము ౩.వాణిజ్యము
౧. రాజకీయ దోపిడిని అరికట్టవలసినది ప్రజలు. గత ముప్పది సంవత్సరాలుగా రాజకీయ నాయకుల అండ దండలతో అవినీతి పెరుగుతూ వచ్చింది.గత ముప్పది సంవత్సరాలుగా రాజకీయ రంగములో తిష్ట వేసిన కుటుంబాలను రాజకీయ రంగము నుండి బహిష్కరించమని ప్రజలకు సూచన యిస్తున్నాము. ప్రస్తుతము రాజకీయ రంగములో వున్న కుటుంబాలను వారి బంధు మిత్రులను రాజకీయ రంగము నుండి వెలివేస్తే తప్ప భారతీయ సమాజము లోని అవినీతి అంతము కాదు. వారిని వెలి వేయగల సామర్ధ్యము వోటర్లకున్నది. ఇంతవరకు వోటర్లకు ప్రత్యామ్నాయము లేదు. ఎవరిని ఎన్నుకున్నా వొరిగేదేమున్నదిలే అన్న నిస్పృహ వోటర్లలో చోటు చేసుకున్నది.
భారత జాతి మనుగడ సిద్ధాంత రూపకల్పన తో పాటు వోటర్లకు ప్రత్యామ్నాయాన్ని సూచించ వలసిన బాధ్యతని 'ధర్మ నేత్రం' స్వీకరించి యున్నది. రాజకీయ రంగములోని వ్యక్తులను సంస్థలను ప్రజలు విశ్వసించే స్థితిలో లేరు. యువతీ యువకులు రాజకీయ రంగము లోకి వస్తే ప్రజలు విశ్వసిస్తారు. ఇంత వరకు రాజకీయ రంగము లో లేని వారినే మన అభ్యర్ధులుగా నిలబెడదాము. అంతిమ తీర్పు ప్రజలది.
౨. పాలనా యంత్రాంగము ను యధా తధముగా కొనసాగిస్తే ప్రజలకు నీతి వంతమైన పాలనా అందించడము సాధ్య పడదు. అవినీతి పరులను తొలగించి వారి ఆస్తులను జప్తు చేయాలి. న్యాయ శాఖ లోను అవినీతి పరులున్నారు. అవినీతి పరులు సమాజ ద్రోహులు. వీరిని శిక్షించడానికి రాష్ట్రము లో 90 వేల మంది యువ సేన ను సిద్ధము చేస్తాము. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గము నుండి 300 మంది యువతీ యువకులను ఇందులో చేర్చుకుని తర్ఫీదు యివ్వాలి.
పోలీసు
భారతీయ సమాజం లో అవినీతి , అధర్మం పాలు పెరిగిపోయి వ్యవస్థలే నిర్వీర్యమై పోతున్నాయి. ఎవరికి వారం అందినంత దోచుకుందాం అన్న భావన నుండి బైట పడాలి. ఉగ్రవాదులతో పోరాడి అసువులులు బాసిన పోలీసులకు మా నమస్సుమాంజలులు.
నేరస్తులతో పోలీసులు లాలూచి పడుతున్న సంఘటనలు రాను రాను ఎక్కువై పోతున్నాయి. ఎందరో స్వాతంత్ర సమర యోధులు తమని తాము అర్పణ చేసుకుని మనకి స్వేచ్చని ప్రసాదించారు. మన ప్రజాస్వామ్యం నేరస్తుల చేతుల్లో బందీ అయిపోయింది. పొలిసు యంత్రాంగము లోని అవినీతి యిందుకు ప్రధాన కారణం.
నేరస్తులకు రక్షణ కల్పించడం నేరముకన్నా ప్రమాదకరం. మేము ఎవరినీ శత్రువులుగా భావించడం లేదు. పొలిసు యంత్రాంగం లోని అవినీతిని ఆసరా చేసుకుని పాకిస్తానీ తీవ్రవాదులు హైదరాబాదు లో స్థావరములు ఏర్పాటు చేసుకుంటారని పదిహేను సంవత్సరాల క్రితమే రాజకీయ విశ్లేషకులు హెచ్చరించి యున్నారు.
అవినీతితో ప్రజలు విసిగిపోయి వున్నారు. అవినీతిపరులను 'శవాలపై చిల్లర ఏరుకునే వెధవలు ' అని ప్రజలు చీత్కరిస్తున్నారు. అవినీతిపరులకు, వారి సంతానమునకు ఆస్తి హక్కు లేకుండా చేయాలి.
అవినీతికి ప్రజల అండ దండలు
అవినీతి ఆకాశము లోనుండి వూడి పడలేదు. అది ప్రజల మధ్య వారి ఆమోదము తోనే పెరిగింది. తమ ప్రహరి గోడలను వీధుల్లోకి నెట్టి రహదారులను యిరుకు చేసింది ప్రజలే. హాని కరమైన రసాయనాలను పండ్లు, కూర గాయల పై చల్లి మార్కెట్ లో అమ్ముతున్నది ఎవరు . పరీక్షల్లో కాపి కొట్టేది ఎవరు. అధిక వడ్డీలు గుంజు తున్నది ఎవరు. తప్పుడు లెక్కలు చూపి పన్నులు ఎగవేస్తున్నది ఎవరు. న్యాయ స్థానాల్లో తప్పుడు సాక్ష్యం చెప్పేది ఎవరు. వర్గాలుగా వీడి పోయి కలహించు కుంటున్నది ఎవరు . ఈ ప్రశ్నలకు అంతము లేదు. ప్రజాస్వామ్యములో వోటు హక్కును అమ్ముకోవడము ప్రజల లోని అవినీతికి పరాకాష్ట . కనీసం కోటి రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత లేని వారు రాజకీయ రంగము లోకి రావడానికి సంకోచిస్తున్నారు.
ప్రజలను అమాయకులు గాను, అవినీతి పరులను రాక్షసులు గాను చిత్రీకరిస్తే సమాజమును సంస్క రించ లేము . మనదేశ ప్రజలకు మరింత క్రమ శిక్షణను అలవాటు చేయాలి . యితరుల హక్కులను గవుర వించ డము అలవాటు చేయాలి. రెమ్మలు నరికితే అవినీతి మళ్ళి చిగు రిస్తుంది. మొదలు పెకలించాలి.
ఒక పార్టీ ప్రభుత్వము అధికారములో వున్నప్పుడు కొన్ని కీలక పదవులలో తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించడం పరిపాటి. ముఖ్య మంత్రి తనకు రక్షణగా వున్నా రక్షక దల సిబ్బందిని సైతం నమ్మలేని స్థితి. ప్రజాస్వామ్యములో ఎన్నికల తరువాత రౌతు మారుతున్నాడే తప్ప గుర్రాలు మారడము లేదు. అవినీతి గుర్రాల మీద ఎ రౌతు ఎక్కినా వాటి బుద్ధిని మార్చడము సాధ్య పడదు. ఈ సత్యమును గ్రహించి అవినీతిని అంతము చేయడము సాధ్య పడదని ప్రజలు నిర్ధారణకు వచ్చినారు. అవినీతితో సహజీవనానికి అలవాటు పడినారు. హోటల్ లో వెయిటర్ కు టిప్ యిచ్చిన చందాన అధికారులకు మామూళ్ళు యిచ్చి పనులు చేయించు కుంటున్నారు.
పాలనా యంత్రాంగము లోని అవినీతి ప్రజలలోని నీతి శాతాన్ని వెల్లడి చేస్తుంది. ప్రజలు నీతివంతులు కానిదే వారికి స్వచ్చమైన పాలన అందించుట సాధ్య పడదు. ధర్మము యొక్క ఉనికి ప్రజలపై ఆధారపడి యున్నది. 12 మందిలో కనీసం ఒకడైనా ధర్మమును ప్రేమించువాడు లేని యెడల ధర్మ స్థాపన జరుగదు. మనము ఎ మార్గము ద్వారా ధర్మ స్థాపన చేయ బోతున్నామో ప్రజలకు స్పష్టముగా తెలియ జేయాలి. ఎన్నికలను ధర్మ నేత్రం సిద్ధాంతాలకు రేఫెరెండం లా మనము భావించాలి. మనకి అనుకూలముగా 8 శాతము ఓట్లు పోలయితే అది ప్రజామోదాన్ని తెలియ జేస్తుంది. అది నైతిక విజయం.
౩.వాణిజ్యములో రిటైల్ రంగానిది కీలక పాత్ర.. నిజమైన ప్రజాస్వామ్యములో ఉత్పత్తి దారులు విక్రయించే ధరకి వినియోగ దారులు కొనే ధరకి మధ్య వ్యత్యాసము తక్కువగా వుండాలి. ప్రస్తుతము భారత దేశములో నల్ల ధనము ఎక్కువగా వున్నది. ఆ ధనములో సింహ భాగము వస్తువులను కొని అక్రమముగా నిల్వ యుంచే దానికి వినియోగించ బడుచున్నది. వస్తువులకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధరలు పెరుగుతున్నాయి. వినియోగ దారులపై అదనపు భారము పడు చున్నది. ఈ దోపిడీని ప్రభుత్వాలు అరికట్ట లేవు.
అతి త్వరలో 'ధర్మ నేత్రం' Retail Marketing Company ని స్థాపిస్తుంది. Rs.50,000 లు కంపెనీలో డిపాజిట్ చేసిన వారిని ఎజెంటులుగ నియమించా బడతారు. వీరు విక్రయించే వస్తువుల పైన 5% కమీషను యిస్తాము. రాబోయే ఐదు సంవత్సరాల కాలములో తెలుగు రాష్ట్రములో ఐదు లక్షల మంది ఎజెంటులను నియమించాలి.
యాభై వేల రూపాయల పెట్టుబడితో మీరు Retail Marketing Company లో ఏజెంటుగా చేరండి. నెలకు లక్ష రూపాయల సరుకు ఎలా విక్రయించాలో కంపెని మీకు తర్ఫీదు యిస్తుంది. ఈ నెట్వర్క్ ద్వారా మనకు అవసరమైన కీలక సమాచారాన్ని సేకరించ వచ్చు.
ప్రజలు మనకు వోట్లు వేసి గెలిపించిన తర్వాత సభా పర్వం మొదలవుతుంది. ఏదో మిసన సమ్మె చేసి తమ బలాన్ని చాటు కోవాలని ఉద్యోగ సంఘాలు ప్రయత్నిస్తాయి. సమ్మె చేసిన వారిని మనము శాశ్వతంగా ఉద్యోగాలనుండి తొలగించాలి. ఇందుకు మన యువ సేన సిద్దముగా వుండాలి. ఈ యువసేనలో చేరిన వారికి చేరిన మాసము నుండే నెలకు పది వేల రూపాయల వేతనము లభించాలి.